తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేరుతో సైబర్ నేరగాళ్లు వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. వాట్సాప్ ద్వారా పనిచేస్తున్న ఈ ముఠాపై స్వయంగా మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి పేరుతో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి పేరుతో కొంతమందికి మెసేజ్‌లు కూడా వచ్చాయి. 9353849489 నంబర్ నుంచి మెసేజ్ వస్తే ఎవరూ స్పందించవద్దని మంత్రి ఫిర్యాదులో సూచించారు. పోలీసులు విచారణ చేపట్టారు.