కామారెడ్డిలో ఆందోళనలకు కారణమవుతున్న మాస్టర్ ప్లాన్‌పై జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ కేవలం డ్రాఫ్ట్ మాత్రమేనని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. 60 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తామని, ప్రతి అభ్యంతరానికి జవాబు ఇస్తామని తెలిపారు. అపోహలతో నిరసనలు చేయొద్దని కోరారు. భూమి పోతుందనే వార్తలు అవాస్తవాలని అన్నారు. 2000 సం.లో పాత మాస్టర్‌ప్లాన్ ఇచ్చారని, దాని ప్రకారమే ప్రస్తుత మాస్టర్‌ప్లాన్ ఇచ్చామని వివరించారు.