హైదరాబాద్ ఘట్కేసర్లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణ ఘటన వెలుగుచూసింది. కాలేజీ అమ్మాయిల ఫోటోలు న్యూడ్ ఫోటోలుగా మార్ఫింగ్ చేసి కొంతమంది ఆగంతుకులు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. దినిపై విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కళాశాలకు చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనని డీపీలను తీసుకుని ఫోటోలు మార్ఫ్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే కొంతమంది విద్యార్థులను విచారిస్తున్నారు.