ఒక కంపెనీ పాల ప్యాకెట్‌పై iim ALUMNI అని ప్రింట్ చేయడంపై ట్విట్టర్లో పెద్ద చర్చే జరుగుతుంది. ఒక పాల ప్యాకెట్‌పై మీ కాలేజ్ పేరును రాయల్సిన అవసరం ఏముంది అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేయగా అది వైరల్‌గా మారింది. IIM పూర్వ విద్యార్థులు కలిసి ఈ పాల ఉత్పత్తి సంస్థను ప్రారంభించారు. పాల ప్యాకెట్లపై iim ALUMNI అని ప్రింట్ చేస్తున్నారు. వాళ్ల ఉత్పత్తులపై ఎలాంటి ఫిర్యాదు లేదు కానీ నమ్మకం అనేది నాణ్యతను బట్టి పెంచుకోవాలి కానీ కాలేజీ పేర్లతో కాదు అని అతడు ట్వీట్ చేశాడు. ఇది బ్రాండ్‌ను త్వరగా ప్రజల్లోకి చేర్చేందుకు వ్యూహాత్మక ప్రణాళిక అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.