మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాన్నిదక్కించుకుంది. శాసనసభలో పార్టీకి 4 ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రమే గెలవగలిగే బలం ఉన్నా.. 5 స్థానాలను గెలుచుకుంది. అధికార కూటమి ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా అదనపు స్థానం దక్కింది. మొత్తంగా 10 ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగ్గా… బీజేపీకి 5, శివసేన నేతృత్వంలోని అధికార కూటమికి 5 స్థానాలు దక్కాయి. అసెంబ్లీలో 44 మంది కాంగ్రెస్ సభ్యులు ఉండగా, 41మంది మాత్రమే ఆ పార్టీకి ఓటు వేశారని సమాచారం. అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని స్పష్టమవుతోంది.