ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈనెల 20న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు పంపింది. కాగా కవిత ఈ నెల 16నే ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ అనారోగ్యంతో బాధపడుతుంటం వల్ల విచారణకు హాజరుకాలేనని కవిత ఈడీకీ ఈమెయిల్ చేసింది. దీనికి స్పందించిన ఈడీ మరో తేదీని ఖరారు చేసి నోటీసులు పంపింది. కాగా ఈ నెల 8న తొలిసారి కవిత ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.