తనను ఎన్‌కౌంటర్ చేయనంటేనే చికిత్స తీసుకుంటానని ఓ ఖైదీ పోలీసులతో మంకు పట్టు పట్టాడు. యూపీలోని హర్దోయి జిల్లా జైలులో ఓ ఖైదీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో డయాలసిస్ నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ ఖైదీ.. తనను ఎన్‌కౌంటర్ చేయనంటేనే డయాలసిస్ చేయించుకుంటానని తేల్చిచెప్పాడు. ఎన్‌కౌంటర్ చేయమని పోలీసులు ఎంత చెప్పినా వినలేదు. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే డయాలసిస్ చేయించుకుంటానని భీష్మించుకు కూర్చున్నాడు.