వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తొలిరోజే సిలిండర్ ధర పెంచింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ. 25 వడ్డించింది. దీంతో దిల్లీలో సిలిండర్ ధర్ రూ. 1769, ముంబైలో రూ. 1721, కోల్‌కతాలో రూ. 1870, చెన్నైలో రూ. 1971కి చేరింది. గృహ వినియోగ సిలిండర్లలో ఎలాంటి మార్పు లేదు. వీటిి చివరిసారిగా 2022 జూలై 6న ఆయిల్ కంపెనీలు పెంచాయి. గతేడాది నాలుగుసార్లు పెంచుతూ నిర్ణయించారు.