తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత డెత్ మిస్టరీపై విచారణ చేపట్టి అందులో ఉన్న నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఏఐఏడీఎంకే ప్రభుత్వం రిటైర్డ్ న్యాయమూర్తి అర్ముగ స్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. కానీ ఈ కమిషన్కు అనేక అవాంతరాలు ఎదురుకావడంతో విచారణ వేగంగా జరగలేదు. దీంతో ఇంకా ఈ కమిషన్ రిపోర్టును సమర్పించలేదు. దీంతో అర్ముగ స్వామి కమిషన్కు సుప్రీం కోర్టు.. ఎయిమ్స్ వైద్యులను సుప్రీం రంగంలోకి దించింది. ఇక వీరి సహకారంతో కమిషన్ మరింత వేగంగా ఈ కేసును విచారించేందుకు సిద్ధమవుతోంది. గతంలో జయకు చికిత్స చేసిన అపోలో వైద్యులను కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది.