TS: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాకు వచ్చే ఆరు నెలల్లో రూ.1,544 కోట్లు ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. నల్గొండ జిల్లాపై మంత్రులతో కలిసి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ‘నల్గొండ జిల్లాలోని 12 స్థానాలూ తెరాసవే. పార్టీని ఆదరించినందుకు ప్రజలకు ధన్యవాదాలు. మునుగోడులో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. చండూరు మున్సిపాలిటీకి రూ.50కోట్లు, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.30కోట్లు మంజూరు చేస్తాం. మునుగోడులో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తాం’ అంటూ కేటీఆర్ వరాల జల్లు కురిపించారు.