రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడితో పాటు పలువురు కోచ్లపై రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలు విచారించేందుకు కేంద్రం కమిటీని నియమించింది. బాక్సర్ మేరి కోమ్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఒలింపిక్స్లో మెడల్ సాధించిన యోగేశ్వర్ దత్, ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత తృప్తి ముర్గుందే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులు రాధికా శ్రీమన్, టాప్స్ మాజీ సీఈఓ రాజేశ్ రాజగోపాలన్ ఉన్నారు. రెజ్లర్ల ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వనున్నారు.