దేశంలోని 45 సెంట్రల్ యూనివర్శిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లలో అడ్మిషన్ల కోసం తొలిసారిగా తప్పనిసరి సాధారణ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు UGC ఛైర్మన్ M జగదీష్ కుమార్ ప్రకటించారు. ఈ ఎగ్జామ్ జూలై మొదటి వారంలో నిర్వహించబడుతుందని తెలిపారు. కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) కంప్యూటరైజ్డ్ పరీక్ష కాగా, దీనిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుందన్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. అయితే 12వ తరగతి బోర్డు మార్కులు ఎటువంటి వెయిటేజీని కలిగి ఉండవని ఛైర్మన్ అన్నారు.
AP News
సొంత పార్టీ నేతలపై కోటం రెడ్డి తీవ్ర విమర్శలు