ప్రస్తుతం దేశ పౌరులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో తమ వివరాలను ఆధార్‌కార్డులో ఎప్పటికప్పుడు పౌరులు అప్డేట్ చేసుకుంటున్నారు. అయితే, ఈ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఫిర్యాదు చేయాలో చాలా మందికి తెలియకపోవచ్చు. పోస్టు, ఈమెయిల్, చాట్ బాట్, ఫోన్ కాల్, వెబ్సైట్ ద్వారా UIDAIకి ఫిర్యాదు చేయొచ్చు. సమీపంలోని రీజినల్ కార్యాలయాలకు పోస్టు ద్వారా లేదా నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు.