అజారుద్దీన్‌పై HRCకి ఫిర్యాదు

© ANI Photo

హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో బీసీ ఐకాస చైర్మన్ యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. భారత్‌-అసీస్ మ్యాచ్ టికెట్ల విషయంలో అజార్ అవినీతికి పాల్పడ్డారని, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాటకు ప్రధాన కారణం అజారుద్దీన్ అని ఆరోపించారు. టికెట్ల జారీ విషయంలో హెచ్‌సీఏ పూర్తిగా విఫలమైందని, క్షతగాత్రులను ఆదుకోవాలని ఆయన కోరారు.

Exit mobile version