AP: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. కుప్పంలో మూడు రోజుల పాటు జరిగే యాత్రకు అధికారులు 15షరతులు విధించారు. కుప్పంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు 14 రకాల ఆంక్షలు విధించారు. పాదయాత్రలో భాగంగా ఎక్కడా రోడ్‌షోలు నిర్వహించకూడదని పోలీసులు షరతు విధించారు. ప్రజలతో చేసే ఇంటరాక్షన్ బహిరంగ సభలా ఉండొద్దని తెలిపారు. మైకులో మాట్లాడాలని భావిస్తే పలమనేరు డీఎస్పీ అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ నెల 27నుంచి 29వరకు కుప్పంలో పాదయాత్ర సాగనుంది.