‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్‌ను పలువురు సెలబ్రిటీలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ‘ఇంకొక్క అడుగే’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం ఆనందంగా ఉందని నందమూరి బాలకృష్ణ అన్నారు. పవన్ కల్యాణ్, రక్షిత్ శెట్టి, వెంకటేశ్, మంచు విష్ణు, రవితేజ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా అభినందనలు తెలిపారు.