2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 3 రోజుల మేధోమథన సదస్సు ‘చింతన్ శివిర్’ శుక్రవారం నుంచి కాంగ్రెస్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 6 గ్రూపుల్లోని 400 మంది ప్రతినిధులు పలు అంశాలపై చర్చించనున్నారు. శుక్రవారం పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం, రాబోయే ఎన్నికల సవాళ్లు, ప్రత్యేక అజెండా ప్రణాళికపై నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.