భారతదేశానికి స్వాత్రంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ తన ట్విట్టర్ ప్రొఫైల్ ఫోటోను మార్చింది. మాజీ ప్రధాని పండిట్ జవహార్‌లాల్ నెహ్రు ఫోటోను పెట్టింది. ఈ సందర్భంగా ‘త్రివర్ణ పతాకం మన గుండెల్లో, రక్తంలా మన సిరల్లో ఉంది. 1929 డిసెంబరు 31న పండిట్ నెహ్రూ రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ.. ఇప్పుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు, దానిని వంచకూడదు’ అని అన్నారు. దేశ అఖండ ఐక్యతను చాటే ఈ త్రివర్ణ పతాకాన్ని మనమందరం మన గుర్తింపుగా మార్చుకుందాం. జై హింద్’ అంటూ ట్వీట్ చేసింది.