గుజరాత్‌లో డీలా పడిన కాంగ్రెస్

© ANI Photo

గుజరాత్‌లో ఇక హస్తం పార్టీ మరుగున పడినట్లే కనిపిస్తోంది. రాష్ట్రంలో చెప్పుకోదగ్గ కాంగ్రెస్ నేతలు లేకపోవడం కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ఈ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసి అప్రతిష్ఠ పాలయ్యింది. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల(77)లో ఇప్పటివరకు ఏడింటిని మాత్రమే నిలబెట్టుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ రంగప్రవేశం కాంగ్రెస్‌ని పరోక్షంగా దెబ్బతీసింది. 10 శాతం సీట్లూ గెల్చుకోలేక హస్తం పార్టీ చతికిల పడింది. ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది. మరోవైపు ఆప్ సీట్లు గెల్చుకోవడంలో విఫలమైనప్పటికీ.. పోటీ చేసిన తొలిసారే సుమారు 13 శాతం ఓట్లు కొల్లగొట్టింది.

Exit mobile version