పోలీస్ అధికారి కాలర్ పట్టుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి సంఘటన మరువక ముందే మరొకటి చోటుచేసుకుంది. తాజాగా మహిళా కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ నెట్టా డిసౌజా మంగళవారం భద్రతా సిబ్బందిపై ఉమ్మివేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును నిరసిస్తు ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన నిర్వహించింది. ఈ నేపథ్యంలో సంఘటన చోటుచేసుకుంది. దీనిని BJP నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.