కాంగ్రెస్ నేత సుబోధ్ కాంతి సహాయ్ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. హిట్లర్ లా వ్యవహరించే వారు హిట్లర్ లాగానే గతి లేని చావు చస్తారని అన్నారు. సుబోధ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు పలువురు మండిపడుతున్నారు. ఒక దేశ ప్రధానిని పట్టుకుని ఇలా మాట్లాడడం సబబు కాదని.. కాంగ్రెస్ ఇలా వ్యాఖ్యానించడం మానుకోవాలని హితవు పలికారు. జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ మాట్లాడుతూ.. గుజరాత్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మోదీని విమర్శించినందుకే ప్రజలు తీవ్రంగా బాధపడ్డారని తెలిపాడు.