హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. 68 స్థానాలకు గానూ 39 చోట్ల కాంగ్రెస్ లీడ్లో ఉంది. బీజేపీ 26 స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇక్కడ ముగ్గురు ఇండిపెండెంట్లు ఆధిక్యంలో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 35ను దాటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. అభ్యర్థులను శిబిరానికి తరలించి ‘ఆపరేషన్ కమలం’ నుంచి కాపాడుకోవాలని చూస్తోంది.