• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్ G23 నేతల సమావేశం.. అధినాయకత్వ మార్పే వారి ప్రధాన డిమాండా..?

    గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ గత కొద్ది రోజుల నుంచి వరుసగా విఫలమవుతూ వస్తోంది. మొన్నటికి మొన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఘోర ఫలితాలను చవి చూసింది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే.. కష్టమని, వెంటనే పార్టీ అధినాయకత్వాన్ని మార్చాలని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలైన G23 నేతలు డిమాండ్ చేస్తున్నారు. 2020లోనే కొంత మంది నేతలు అధినేత్రి సోనియా గాంధీకి లేఖరాశారు. ప్రస్తుతం కూడా వీరు సీనియర్ కాంగ్రెస్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు గులాంనబీ ఆజాద్ ఇంటిలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వర్చువల్‌గా కూడా కొంత మంది కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలోని అంతర్గత కుమ్ములాటల వల్లే పంజాబ్‌లో దారుణంగా ఓడిపోయామని వివరించారు.