కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముకుల్ వాస్నిక్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు (G-23) నేతలు ఈ రోజు సమావేశం కానున్నారు. ఇతడు మహారాష్ట్రలోని రామ్‌టెక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఇతడి పేరునే పార్టీ అధ్యక్షుడిగా ఖరారు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ భవితవ్యం మార్చాలంటే పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని సీనియర్లు పట్టుబడుతున్నారు.