తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తనకు ప్రత్యర్థిగా ఉన్న టీఆర్ఎస్ నేత విజయా రెడ్డి కాంగ్రెస్ లో చేరడం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. కాసేపట్లో మీడియా ఎదుటకు వచ్చి తన రాజీనామాకు గల కారణాలను ఆయన విశ్లేషించనున్నారు.