రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన ట్వీట్ చేశాడు. దర్శకధీరుడు రాజమౌలి హత్యకు కుట్ర పన్నుతున్నారని వెల్లడించాడు. ఎలాగైనా భద్రత పెంచుకోవాలని రాజమౌలికి సూచించాడు. ‘భారత్‌లో మిమ్మల్ని హత్య చేయడానికి దర్శకులంతా ఏకమయ్యారు.అందులో నేను కూడా ఉన్నాను. నాలుగు పెగ్గులు వేసేసరికి సీక్రెట్‌ని బయటకు చెప్పేస్తున్నా. ఎలాగైనా మీరు భద్రత పెంచుకోండి’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఇది వైరల్ అయింది. ఈ ట్వీట్‌పై భిన్న రకాలుగా స్పందనలు వస్తున్నాయి. కొందరేమో తాగేసి వాగాడని అంటుండగా, మరికొందరు తేలిగ్గా తీసుకోవద్దని సూచిస్తున్నారు.