రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో దానిని రద్దు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. మే 14న రెండో షిప్టు పరీక్షకు కొద్దిసేపటి ముందు పేపర్ లీక్ అయింది. దీని స్క్రీన్‌షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జైపూర్‌లోని దివాకర్ పబ్లిక్ స్కూల్ సూపరింటెండెంట్ రెండో షిఫ్ట్ సమయంలో ముందే పేపర్ కవరు తెరిచారని గుర్తించారు. దీంతో ఈ షిప్టు పేపర్ మళ్లీ నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు. పేపర్ లీక్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రాజస్థాన్ పోలీసులు మే 13 నుంచి 16 వరకు కానిస్టేబుల్ ఉద్యోగానికి రాత పరీక్షను నిర్వహించారు.