ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగాయి, ఎందుకంటే అనేక ముడిపదార్థాలకు ఇన్పుట్ ఖర్చులు దాదాపు రెండింతలు అయ్యాయి. బిల్డర్లు, కాంట్రాక్టర్లు వాటి నిర్మాణాలను పూర్తి చేయలేకపోతున్నారు. స్టీల్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్స్, టైల్స్, శానిటరీ మెటీరియల్స్, సిమెంట్ ధరలు పెరిగాయి.నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ. 1,500 నుంచి రూ. 2,300–2,500 వరకు పెరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ చైర్మన్ S.V.M. చంద్రశేఖర్ చెప్పాడు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత మెటీరియల్ 33 శాతం పెరిగాయి. కానీ, గత ఒక నెల నుంచి, ఖర్చులు 50 శాతానికి పెరిగాయని అన్నారు. ఈ కారణంగా చాలా మంది బిల్డర్లు నిర్మాణ కాంట్రాక్టులు తీసుకోవడం మానేశారని, కేవలం లేబర్ కాంట్రాక్టులు మాత్రమే తీసుకుంటున్నారని తెలిపారు.