యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి నెల్లూరు వినియోగదారుల ఫోరం రూ.4.65 లక్షల జరిమానా విధించింది. వివరాల ప్రకారం.. అరవ సారా అనే మహిళ వేదాయపాలెంలోని వెంకటరెడ్డి నగర్లో నివసిస్తున్నారు. ఈమె ఎస్బీఐ స్కీమ్ కింద బొలేరో వాహనాన్ని కొనుగోలు చేశారు. అలాగే UIIC సంస్థలో రూ.21,460 పెట్టి వాహనానికి ఇన్సూరెన్స్ చేయించారు. కాని వాహనం ఇంటిముందు పార్క్ చేయగా మార్చి 17, 2012లో చోరీకి గురైంది. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా..మూడేళ్ల అనంతరం వాళ్లు అన్ట్రెసబుల్ సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో చోరీకి గురైన వాహనానికి ఇన్సూరెన్స్ చెల్లించాలని ఆమె సంస్థను కోరగా వాళ్లు ఆలసత్వం ప్రదర్శిస్తూ వచ్చారు. వెంటనే కన్యూమర్ ఫోరాన్ని సంప్రదించగా కేసును విచారించి మహిళకు రూ.4.65 చెల్లించాల్సిందిగా ఆదేశించారు.