స్త్రీలకే కాకుండా పురుషులకు కూడా గర్భ నిరోధక మాత్రలు వచ్చేశాయి. మిన్నెసోటా యూనివర్సిటీ పరిశోధకులు పురుషుల కోసం ఆవిష్కరించిన ఓ గర్భ నిరోధక మాత్రను ఎలుకలపై ప్రయోగించారు. ప్రయోగంలో ఈ మాత్రలు 99% ప్రభావవంతంగా పని చేశాయని పరిశోధకులు తెలిపారు. ఈ మాత్రలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని చెబుతున్నారు. త్వరలోనే మానవులపై ప్రయోగించనున్న ఈ మాత్రలను YCT529 అని నామకరణం చేశారు. ఎలుకలపై జరిపిన ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో మానవులపై జరిగే ప్రయోగం కూడా సక్సెస్ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.