అమెరికా మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి మైక్ పాంపియో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్‌ను మంచి రాజకీయ వేత్తగా చూడలేదన్నారు. ఆమెను యూఎస్‌లో ఉపయోగించే అవమానకరమైన గూఫ్ బాల్, హార్ట్ ల్యాండ్ పొలిటికల్ హ్యాక్ అన్నారు. జైశంకర్‌ను మాత్రం ఆకాశానికి ఎత్తేసిన మైక్..ఇంతకంటే సమానహోదా కలిగిన వ్యక్తి ఉండడు. నాకంటే కూడా గొప్ప వ్యక్తి “ అన్నాడు. ఇటీవల రాసిన తన నెవర్ గివ్ ఆన్ ఇంచ్ పుస్తకంలో వీరిగురించి ప్రస్తావించాడు.