తెలంగాణలో ఆదివారం 32,834 మందిని పరీక్షించగా కొత్తగా 705 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 5,543కు చేరుకుంది. ఈ కేసులలో అత్యధికంగా GHMC పరిధిలోనే 355 కేసులు నమోదయ్యాయి. అటు ఇదే సమయంలో కరోనా బారి నుంచి 531 మంది కోలుకున్నారు.