దేశంలో కరోనా కేసులు అనూహ్య రీతిలో పెరుగుతున్నాయి. ఫోర్త్ వేవ్ భయాలు కమ్ముతున్న వేళ చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తోంది. దేశంలో కొత్తగా 15,940 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 20 మందిని మహమ్మారి బలితీసుకుంది. ప్రస్తుతం 91,779 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 4.39 శాతానికి చేరింది. ప్రజలు మళ్లీ జాగ్రత్తలు పాటించాలని..ఎట్టి పరిస్థితుల్లో వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది.