715 రోజుల తర్వాత వెయ్యిలోపు కరోనా కేసులు

© File Photo

భారతదేశంలో రోజువారీ కోవిడ్-19 కేసులు 715 రోజుల తర్వాత వెయ్యి కంటే తగ్గాయి. గత 24 గంటల్లో 913 తాజా కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,21,358కి చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 1,316 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రికవరీ రేటు దాదాపు 98.76 శాతానికి చేరుకుంది. ఈ క్రమంలో మొత్తం యాక్టివ్ కేసులు 12,597 (0.03%)కి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Exit mobile version