చైనాలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. జీరో కోవిడ్ పాలసీ తర్వాత రోజుకు 9 వేల మంది మరణిస్తున్నట్లు అక్కడి నివేదికలు తెలుపుతున్నాయి. ఒక్క డిసెంబర్లోనే చైనాలో 2 కోట్ల పాజిటివ్ కేసులు నమోదై, లక్ష మంది చనిపోయినట్లు అంచనా. మార్చి నాటికి చైనాలో 100 కోట్ల మందికి కరోనా వైరస్ సోకనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు చైనాపై ఆంక్షలు విధిస్తున్నాయి. చైనా నుంచి తమ దేశంలోకి ఎవరినీ రానివ్వమని మొరాకో స్పష్టం చేసింది.