ఢీల్లీలో క‌రోనా నాలుగో వేవ్ ప్రారంభ‌మైందా?

© ANI Photo

దేశ రాజ‌ధాని ఢిల్లీలో శ‌నివారం ఒక్క‌రోజే కొత్త‌గా 461 క‌రోనా కేసులు, 2 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దీంతో పాజిటివిటీ రేటు 3.95 శాతం నుంచి 5.33 శాతానికి పెరిగింది. ఢిల్లీ ఆరోగ్య శాఖ వివ‌రాల ప్ర‌కారం ప్ర‌స్తుతం అక్క‌డ 1,262 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాఠ‌శాల‌లు పూర్తిగా ప్రారంభ‌మైన కొన్ని వారాల త‌ర్వాత తిరిగి క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో క‌రోనా నాలుగో వేవ్ ప్రారంభ‌మైంద‌నే ఆందోళ‌న‌లు పెరుగుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఆసుపత్రిలో చేరడం తక్కువగా ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. ఏదైనా కేసును గుర్తిస్తే ప్రభుత్వ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపి)ని అనుసరించాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్ల‌డించారు.

Exit mobile version