హాంకాంగ్ లో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడి ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్నా, అధికారులు లాక్ డౌన్ గురించి ఆలోచించడం లేదు. హాంకాంగ్ పబ్లిక్ డాక్టర్స్ అసోసియేషన్ హెడ్ టోనీ లింగ్ మాట్లాడుతూ.. ఇక్కడ చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదు. దీంతో ఆసుపత్రుల్లో, ఎమర్జెన్సీల్లో డజన్ల కొద్దీ సీరియస్ కేసులు ఉన్నాయి. భయం, నిర్లక్ష్యం కారణంగా చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. తాజాగా హాంకాంగ్‌లో 34,466 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 87 మంది చనిపోయారు.