దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఎవరికి ఫోన్ చేసినా మొదట కరోనా రింగ్ టోన్ వినాల్సిందే. ఇది విని విని.. వినియోగదారులకు చిరాకు వచ్చింది. అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ రింగ్‌టోన్‌లను నిలిపి వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎందుకంటే కోవిడ్ గురించి సందేశం మొత్తం విన్న తర్వాత కానీ ఫోన్ రింగ్ కాదు. దీంతో అత్యవసర సమయాల్లో సమస్యగా మారుతుందని వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం త్వరలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.