కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో గురువారం టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం సోనియా వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల ఆమెతో సమావేశమైన నేతలకు కూడా కరోనా సోకినట్లుగా తెలుస్తుంది. అయితే ఈడీ నోటీసుల ప్రకారం నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 8న సోనియా విచారణకు హాజరవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.