పిల్ల‌ల్లో క‌రోనా ల‌క్ష‌ణాలు ఇవే

© ANI Photo

పాఠ‌శాల‌లు ప్రారంభ‌మైన త‌ర్వాత ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ‌గా కోవిడ్ కేసులు పిల్ల‌ల్లో న‌మోదుకావ‌డంతో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌ప‌డుతున్నారు. అయితే ఎటువంటి భ‌యాలు అవ‌స‌రం లేద‌ని చెప్తున్నారు వైద్య‌ నిపుణులు. ఇది ఒమిక్రాన్ వేరియంట్స్ కంటే వేగంగా వ్యాపిస్తున్న‌ప్ప‌టికీ తీవ్ర‌మైన అనారోగ్యం ఏం గుర్తించ‌లేద‌ని తెలిపారు. పిల్ల‌ల‌కు వైరస్ సోకితే జ‌లుబు, జ్వ‌రం, గొంతు నొప్పి, పొడి ద‌గ్గు, ఒంటి నొప్పులు వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి. త‌ల్లిదండ్రులు వారికి మంచి నిద్ర‌, షౌషికాహారం అందించాల‌ని, అర్హ‌త‌ ఉన్న పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ వేయించాల‌ని సూచిస్తున్నారు.

Exit mobile version