భారత్‌లో ఓ రెండు కంపెనీల్లో తయారైన దగ్గు సిరప్‌ల కారణంగా జాంబియా, ఉజ్బెకిస్థాన్‌లలో మరణాలు సంభవిస్తున్నాయని గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన భారత యంత్రాంగం ఆయా రాష్ట్రాల్లోని నకిలీ సిరప్ రాకెట్ల ముఠా గుట్టు రట్టు చేస్తోంది. తాజాగా ఒడిశాలో ఓ నకిలీ కఫ్ సిరప్ కంపెనీపై అధికారులు దాడులు చేశారు. దాదాపు 12వేలకు పైగా సిరప్ టానిక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధమున్న వ్యక్తులపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ‘ఎస్కఫ్’ అనే కఫ్ సిరప్‌ని అనుమతి లేకుండా తయారు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.