ఓ మహిళ తీవ్రంగా దగ్గడంతో పక్కటెముకలు విరిగిపోయాయి. చైనాలోని షాంగైకు చెందిన హువాంగ్ అనే మహిళ మసాలాలతో కూడిన ఆహారం తీసుకుంది. దీంతో వెంటనే ఆమె తీవ్రంగా దగ్గింది. దగ్గుతోన్న సమయంలో ఆమెకు శరీరంలో నుంచి ఒక శబ్బం వినపడింది. ఆ తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించగా ఆమెకు నాలుగు పక్కటెముకలు విరిగినట్లు నిర్ధారించారు. ఆమె తక్కువ బరువు ఉండడంతో కండరాలు లేక ఎముకలు విరిగిపోయాయని వైద్యులు తెలిపారు.
దగ్గిన మహిళ.. విరిగిన పక్కటెముకలు

© Envato representation