గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఇవాళ రానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. గుజరాత్ లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా ఉవ్విళ్లూరుతోంది. ఇక్కకడ మలం పార్టీనే మళ్లీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్, భాజపా మధ్య తీవ్ర పోటాపోటీ ఉంటుందని పేర్కొన్నాయి. మరికొన్ని ఉపఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.