మధ్యప్రదేశ్లోని ఖెరమై అటవీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. రాణిగంజ్ కు చెందిన దంపతులు ముఖేష్ ఠాకూర్(50), ఇందిరా ఠాకూర్ (45) అటవీ ప్రాంతంలో ఉన్న గుడికి వెళ్లారు. వారిని అక్కడ ఓ ఎలుగుబంటి చంపేసింది. చంపేయడమే కాకుండా వారి శరీర భాగాలను కూడా ఆ ఎలుగుబంటి తింది. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన అధికారులు వారి శరీర అవశేషాలను, క్రూరంగా ప్రవర్తించిన ఎలుగుబంటిని స్వాధీనం చేసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. దంపతులిద్దరినీ ఎలుగుబంటి పొట్టన పెట్టుకోవడంతో వారి కుటంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.