మందుబాబుకు కోర్టు వైరైటీ శిక్ష

© Envato

చెన్నైలో మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ముగ్గురిని గాయాలపాలు చేసిన ఓ వ్యక్తికి కోర్టు తగిన శిక్ష విధించింది. అతడు రెండు వారాల పాటు నగరంలోని రద్దీగా ఉండే కూడళ్లలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై అవగాహన కల్పించేలా కరపత్రాలు పంచాలని ఆదేశించింది. అలాగే 25వేల పూచీకత్తుపై అతడిని విడుదల చేయాలని చెప్పింది. రోజూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అలాగే సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకూ కరపత్రాలు పంచాలని ఆదేశించింది. ఆ తర్వాత స్టేషన్‌కు హాజరై రిపోర్టు చేయాలని సూచించింది.

Exit mobile version