దేశవ్యాప్తంగా వారం రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. రోజురోజుకూ వెలుగు చూస్తున్న కొత్త కేసులతో పలువురు ఆందోళన చెందుతున్నారు. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అయినా కానీ ఎక్కువ మంది మాస్కులు పెట్టుకోవడం లేదు. ఒంటి నిండా నిర్లక్ష్యంతో మాకేమవుతుందిలే అనే ధైర్యంతో తిరుగుతున్నారు. మీరు యువకులయి రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే.. మీకేం కాకపోవచ్చు కానీ మీతో ఉన్న మధ్య వయస్కుల మీద మీ నిర్లక్ష్యం ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మీ నిర్లక్ష్యానికి వారు బలి కావాల్సి వస్తుంది. యాక్టివ్ కేసుల సంఖ్యే కాకుండా పాజిటివిటీ రేటు కూడా విపరీతంగా పెరుగుతూ పోతుంది. కావున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి. మీతోపాటు మీతో ఉన్న వారిని కూడా సురక్షితంగా ఉండనీయండి. ప్రభుత్వాలు కూడా మాస్కులు లేకుండా తిరుగుతున్న వారి విషయంలో అంతగా కఠిన చర్యలు తీసుకోవడం లేదని టాక్ నడుస్తోంది.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం