‘బూస్టర్ డోస్ కోసం కోవిన్‌ రిజిస్టర్ అవసరం లేదు’

దేశంలో కొత్త కరోనా వేరియంట్‌లు వెలుగు చూస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో ఈనెల 10వ తేదీ నుంచి 18 ఏళ్ళు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్లలో ఉచితంగా వ్యాక్సిన్లు వేయాలని సూచించింది. అయితే బూస్టర్ డోస్ తీసుకోవడానికి కోవిన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర తెలిపింది. అన్ని ప్రైవేట్ సెంటర్లు సర్వీస్ ఛార్జీలుగా రూ.150లు తీసుకోవచ్చని తెలిపింది. కాగా సెకండ్ డోస్ తీసుకున్న 9 నెలలు పూర్తయితేనే బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు.

Exit mobile version