డైరెక్టర్ మారుతీతో ఒక కొత్త సినిమాకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ఇండోర్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే షూటింగ్ నిర్వహిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ మూవీ పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్లు హీరోయిన్లుగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.