పాక్‌పై భారత్ క్రేజీ రికార్డు

Courtesy Instagram:

ఆసియా కప్ 2022 సూపర్ 4లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇటీవల జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా నేడు జరగనున్న మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఈ రెండు జట్ల హెడ్ టు హెడ్ మ్యాచెస్‌ను పరిశీలిస్తే.. ఈ రెండు జట్లు మొత్తం 10 టీ20 మ్యాచులు ఆడాయి. వాటిలో 8 మ్యాచుల్లో ఇండియా గెలవగా.. రెండిట్లో మాత్రమే పాకిస్థాన్ గెలిచింది. ఈ లెక్కన చూస్తే నేడు జరగనున్న మ్యాచ్‌లో ఇండియా గెలిచేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version