హష్ ఆయిల్ అక్రమ రవాణా కేసులో దొరికిన ఓ నిందితుడు 2015లో జరిగిన కిడ్నాప్ కేసుకు సంబంధించి ఆసక్తికర విషయం వెల్లడించారు. నిజామాబాద్ నుంచి దుబాయ్ వెళ్లిన ఓ మహిళకు మంచిర్యాలకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరు అక్కడ రెండేళ్లపాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఆమె అక్కడినుంచి తిరిగి వచ్చేసింది. అయితే ఇక్కడికి వచ్చాక ఆర్థిక కష్టాలు భరించలేక… ఓ పథకం వేసింది. తాను గర్భం దాల్చానని డబ్బులు పంపించాలని దుబాయ్‌లో ఉన్న మంచిర్యాల వ్యక్తికి డిమాండ్ చేసింది. అప్పడికే పెళ్లైన అతడు.. పరువు పోతుందని డబ్బులు పంపించాడు. అయితే అతడు తిరిగొచ్చే సమయానికి బాబు లేకపోతే గుర్తిస్తాడని… ఓ గ్యాంగ్‌తో బాబును కిడ్నాప్ చేయించి అతడికి చూపించింది. కానీ అతడు గుర్తుపట్టడంతో ఆ బాబును మళ్లీ గ్యాంగ్‌కు అప్పగించింది. ఎలాగూ బాబును ఇచ్చేద్దామనున్న గ్యాంగ్…. అసలైన తల్లిదండ్రులను డబ్బులు డిమాండ్ చేశారు. కానీ పోలీసుల ట్రాప్‌నకు చిక్కారు. అప్పట్లో ఆ కిడ్నాప్ డబ్బు కోసమే చేశామని చెప్పారు. కానీ ఇటీవల మరో కేసులో దొరికిన నిందితుడు అప్పటి కేసు గురించి నిజాలు వెల్లడించాడు.